ఆవు దూడల ముందస్తు నిర్వహణ

  • పుట్టిన వెంటనే ముక్కులో, నోటిలో ఉన్న మావి పొర లేదా జిగురు పదార్ధాన్ని (శ్లేష్మం) తుడిచివేయాలి.
  • సాధారణంగా పుట్టిన వెంటనే దూడను ఆవు నాకుతుంది. దీనివలన దూడ పొడిగా అయి, శ్వాసక్రియకు మరియు రక్త ప్రసరణకు తోడ్పడుతుంది. ఆవు అలా నాకని పక్షంలో కానీ, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ, దూడను పొడి బట్టతోనో, గోనె సంచీ బట్టతోనో రుద్ది పొడిగా తుడవాలి. ఛాతీ భాగాన్ని చేత్తో ఒత్తి వదిలిపెడుతూ కృత్రిమ శ్వాసను అందివ్వాలి.
  • బొడ్డును శరీరానికి 2 – 5 సెం.మీ దిగువన దారంతో కట్టి ముడి దిగువ భాగంలో 1 సెం.మీ. దూరంలో కత్తిరించి టించర్ అయోడిన్ లేక బొరిక్ ఆమ్లం కానీ లేదా ఏదైనా ఆంటీబయాటిక్ కానీ అద్దాలి.
  • పశువుల దొడ్డిలో నేల మీద తడిగా ఉన్న గడ్డి గాదం తీసివేసి షెడ్డును చాలా శుభ్రంగానూ, పొడిగానూ ఉంచాలి.
  • దూడ యొక్క బరువును తూచి నమోదు చేయాలి
  • ఆవు యొక్క పొదుగును, వీలయితే క్లోరిన్ ద్రావణంతో కడిగి ఆరనివ్వాలి.
  • దూడ మొదటిగా తల్లి పాలు ( జున్ను పాలు) తాగడానికి వదలాలి
  • ఒక గంటలో, దూడ నిల్చుని పాలు తాగడానికి ప్రయత్నిస్తుంది. దూడ బలహీనంగా ఉంటే అందుకు సహాయం చెయ్యాలి.